పలువురు ఆఫీసర్స్ లను అభినంధించిన పోలీస్ కమీషనర్.

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :10
నిజామాబాదు డివిజన్ పరిధిలలోని నవీపేట్ , ముగుపాల్ , నిజామాబాద్ రూరల్ PS ల పరిధిలోని కేసులలో నేరస్థులకు శిక్ష పడేవిధముగా కృషి చేసినందుకు నేడు నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, IPS., పుష్పగుచ్చాలతో మొక్కలతో మరియు శాలువా లతో అభినంధించి సత్కరించడము జరిగింది.

కమిషనర్ పి సాయి చైతన్య చేతుల మీదుగా అభినందనలు పొందిన వారి వివరాలు.
ఎమ్. రాజా రెడ్డి, స్పెషల్ పబ్లిక్ ప్రొసీక్యూటర్,బి. వసంత్, అడిషనల్ పబ్లిక్ ప్రొసీక్యూటర్,బి. రాజేష్ గౌడ్, ఎ. పి. పి. ఓ,ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ,ఎస్. సతీష్ కుమార్ CI ,సురేష్ కుమార్ CI ,బాల్ రెడ్డి SI, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ కె. నవీన్ కుమార్ PC 1712, నవీపేట్ PS ఎ. కిరణ్, PC 2060, నిజామాబాద్ రూరల్ PS,ఎమ్. శ్యామ్ రావ్, PC 2062, ముగ్పాల్ PS లను అభినందించడం జరిగింది.ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ వివిధ కేసులలో నేరస్థులకు శిక్ష లు పడటానికి ఎంతో కృషి చేసారని, ఇదే స్పూర్తితో మిగితా పోలీస్ స్టేషన్ లలో గల కోర్ట్ సిబ్బంది కృషి చేయాలని తెలియచేసారు.ఈ సందర్బంగా ట్రైనింగ్ IPS., సాయి కిరణ్ పత్తిపాక, అదనపు పోలీస్ కమీషనర్ స్పెషల్ బ్రాంచ్ శ్రీనివాస్ రావ్, ఇంచార్జి అదనపు DCP, అడ్మిన్ మస్తాన్ అలీ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!