నిజామాబాద్ డివిజన్ పరిధిలో రెండు కేసులలో జీవిత కారాగార శిక్ష మరియు ఓక కేసు లో సంవత్సరం పాటు శిక్షవిధించిన జిల్లా జడ్జి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:9
రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కర్రతో కొట్టగా చనిపోయిన వ్యక్తి కేసులో జీవితకాల కారాగార శిక్ష విధించిన జిల్లా జడ్జి
తేధి:14.02.2024 రోజున జరిగిన హత్య కేసు లో మృతుడు  జలీల్ ఖాన్ ను నిందితుడు  తంగళవాడి నర్సింగ్@ సోనూ చంద్రశేకర్ కాలనీలో గల కల్లుబట్టి వద్ద జరిగిన గొడవలో మృతుడినీ కర్రతో కొట్టాగా, మృతుడు అక్కడికక్కడే చనిపోవడం జరిగినది, ఈ కేసును సౌత్ రూరల్ CI సురేష్ కుమార్  విచారణ చేపట్టి కోర్టు కు పంపగా, కోర్టులో వాదోపవాదాలు నడిచిన తర్వాత గౌరవ కోర్టు వారు కేసు ను విచారించి నిందితునికి జీవితకాల కారాగార  శిక్షను విధించడం జరిగినది.
నవీపేట్ పీఎస్ పరిధిలోని భర్తను హత్య చేసిన భార్యకు జీవిత ఖైదు విధించిన జిల్లా జడ్జి
నవిపేట్ మండలం జన్నపల్లి గ్రామానికి చెందిన ముక్కల సాయిలు, భార్యపై అనుమానంతో, నిత్యం శారీరక, మానసిక చిత్రహింసలకు గురిచేసేవాడు. రోజు మద్యం తాగివచ్చి, మద్యం మత్తులో భూతులు తిడుతు మానసిక ప్రశాంతలేకుండా చేసేవాడని భావించిన భార్య, భర్తను కడతేర్చాలని నిర్ణయించుకుని 11.04.2024 రాత్రి పదకొండు గంటల సమయంలో మద్యమ్మత్తులో నిద్రిస్తున్న భర్తను రెండు చేతులతో గొంతు నులిమి హత్యచేసింది. చీరతో ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించింది. సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసిన సేషన్స్ కోర్టు, ఇతర దృవీకరించుకున్న పత్రాలు, వస్తుగత సాక్ష్యం ను పరిగణలోకి తీసుకుని ముద్దాయి మక్కల రేఖ తన భర్తను హత్య చేసిందని నిర్ధారిస్తు హత్య నేరంకుగాను ఆమెకు జీవితకాల కారాగార శిక్ష, సాక్ష్యాలను తారుమారు చేసినందున సెక్షన్ 201 ప్రకారం ఏడేళ్ళ కఠిన జైలుశిక్ష విధించారు. రెండు శిక్షలు ఏకకాలంలో అనుభవించాలని జడ్జి ఆశాలత తీర్పులో పేర్కొన్నారు.

ముగ్పాల్ పిఎస్ పరిధిలో ఎస్ఐ పై తిరగబడి విధులకు ఆటంకపరిచిన వ్యక్తికి ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన జడ్జి

మోపాల్ గ్రామంలోని బహిరంగ ప్రదేశంలో మద్యం తాగుతున్న ఇద్దరు వ్యక్తులపై మోపాల్ SI సతీష్  చర్యలు తీసుకునే క్రమంలో మద్యం తాగుతున్న వ్యక్తులు మద్యం మత్తులో ఎస్సై పై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా విధులకు ఆటంకపరచడంతో, అట్టి వ్యక్తులపై ఎస్ఐ  కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపిన అనంతరం, కోర్టులో వాదోపవాదాలు నడిచిన తర్వాత గౌరవ కోర్టు వారు అట్టి వ్యక్తులకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష విధిస్తూ ఈరోజు తీర్పునిచ్చారు.

 

 

Join WhatsApp

Join Now

Leave a Comment