VDC అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదంతో అణచివేస్తాము — పోలీస్ కమీషనర్ వెల్లడి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ : 9
ఈరోజు పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య పత్రిక ప్రకటన విడుదల చేస్తూ గ్రామాలలో జరిగే అన్యాయాలపై ఉక్కు పాదం మోపారు   ఈ గ్రామాభివృద్ధి కమిటీలు , మత పెద్దల, కుల పెద్దల  కమిటీలు అనుకుంటా దిక్కులేని వారికి పీడిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న కమిటీలపై  చర్య తీసుకున్నారు.. పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య మాట్లాడుతూ గత 15 సంవత్సరాలక్రితం కొన్ని గ్రామాలలో గ్రామాభివృద్ధి కోసం గ్రామభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గ్రామాలలో గ్రామాభివృద్ధి అవసరాలకు ప్రభుత్వం నుండి సహయ సహకారాలు పొందకుండా తమ అవసరాలను తీర్చుకోవడం కోసం గ్రామాభివృద్ధి కమిటీలను ఏర్పాటుచేసుకున్నారు. కాలక్రమేణ ఈ గ్రామాభివృద్ధి కమిటీ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలను కాకుండా గ్రామాలలో జరిగే సివిల్ తగాదాలు, భూ తగాదాలు, వివాహ సంబంధ తగాదాలు అన్నదమ్ముల తగాదాలు, భార్యభర్తల తగాదాలలో వారిని పిలిపించి, అట్టి పంచాయితీలలో వారు విననియేడల వారికి దండుగా వేసి, చట్టం చేయవలసిన పనిని వారి చేతులోనికి తీసుకొని, వాళ్ళను పోలీస్ స్టేషన్ కు, న్యాయ స్థానాన్ని ఆశ్రయించకుండా గ్రామ ప్రజలను తాము చెప్పినవిధంగా వినాలని ఎవ్వరూకూడా పోలీస్ స్టేషన్, న్యాయస్థానాన్ని ఆశ్రయించరాదని లేనియెడల మా మాట వినని వారిని ఆ గ్రామం నుండి వెలివేస్తాము అని ,భయబ్రాంతులకు గురిచేసి, గ్రామంలో డబ్బులు వసూలు చేయడానికి గ్రామాభివృద్ది కమిటి పేరుతో బెల్టుషాపులు, కూల్ డ్రింక్ షాపులు, కిరాణ షాపు మరియు కోడిగ్రుడ్డు ధర పై యాక్షన్ (వేలం వేయడం) వేయడంలో ఎవరు ఎక్కువధర చెల్లిస్తారో ఆ వ్యక్తి మాత్రమే ఆ గ్రామంలో ఆ వస్తువులను అమ్మేటట్లు నియమముగా పెట్టి డబ్బులు వసూళ్ళు చేస్తారు.ఆ గ్రామంలో ఎప్పుడైన పంచాయితీలు నిర్వహించినప్పుడు ఇరువర్గాల నుండి డబ్బులు వసూళ్లు చేసి పంచాయితీలను నిర్వహిస్తారు. అట్టి డబ్బును విచ్చలవిడిగా ఖర్చుచేస్తారు. కావున గ్రామాభివృద్ధి కమిటి నిర్వహించే కార్యకలాపాలు పూర్తిగా చట్టవ్యతిరేకం.భాతర దేశంలో గల ఏ వ్యక్తి అయిన భారత ప్రభుత్వం చట్టాలను గౌరవించి ఆ చట్టాలకు లోబడే తమ కార్యకలాపాలు నిర్వహించాలి. ఎవ్వరికైన ఎలాంటి సమస్యలు వచ్చిన సంబంధిత శాఖలను సంప్రదించి ఆ శాఖ నుండి సహయసహకారాలు పొందాలి. కాని గ్రామాభివృద్ధి కమిటి వారు వాళ్లు చెప్పిందే శాసనం అని, చట్టం అని చెప్పి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి తప్పుద్రోవ పట్టిస్తున్నారు.ఎవ్వరికైనా ఈ గ్రామాభివృద్ధి కమిటీల వలన ఎలాంటి ఇబ్బందుల వచ్చిన వారు తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్ అధికారిని సంప్రదించగలరు. కావున భవిష్యత్తులో ఎవ్వరయిని ఇలాంటి బహిష్కరణలు చేసినట్లయితే వారిపై చట్టరిత్య కఠిన మైన చర్యలు తీసుకోబడును, ఎవ్వరిని కూడా ఉపేక్షించేది లేదు అని పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య హెచ్చరించారు.

 

 

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!