నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్: 7
గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఒక్కో సిలిండర్పై రూ.50 పెంచింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అధికారిక ప్రకటన చేశారు.దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలపై సుంకాన్ని పెంచిన కేంద్రం.. కాసేపటికే వంట గ్యాస్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉజ్వల పథకం సిలిండర్లపైన కూడా పెంపు వర్తించనుంది. పెరిగిన ధరలు మంగళవారం నుంచి అమలులోకి రానున్నాయి. సిలిండర్ ధర పెంపుతో అన్ని వర్గాల వారు పెదవి విరుస్తున్నారు.