తాళ్ల రాంపూర్ వీడీసీ ని రద్దు చేయాలి తెలంగాణ బిసి గ్రాడ్యుయేట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు అబ్బగోని అశోక్ గౌడ్ డిమాండ్…

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :7
నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం లోని ఏర్గట్ల మండల కేంద్రం తాళ్ల రాంపూర్ గ్రామంలో దాదాపు 16 మంది గీత కార్మికులను బహిష్కరించడం అమానుషమని రోజురోజుకు వీడీసీల నియంతృత్వ పరిపాలన అరికట్టే విధంగా చర్య తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు అబ్బ గొని అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు.
గీతా కార్మికులలో ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కలిసి జీవనాభివృద్ధి కోసం పనిచేస్తుండగా వారిని భంగం కలిగిస్తూ అవమానపరచడమే కాకుండా గ్రామం నుండి బహిష్కరణ చేసినందున వీడీసీలపై తగిన చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినట్టు అబ్బ గోని అశోక్ గౌడ్ తెలియజేశారు.అదేవిధంగా శ్రీరామనవమి పర్వదినాన గౌడ సోదరులు కుంకుమార్చన లో భాగంగా ఆలయంలో కూర్చొని కుంకుమార్చన చేయ టానికి అన్ని సిద్ధం చేసుకుని వచ్చారని వారిని అదే సమయంలో నుంచి బయటకు గెంటి వేయడం పట్ల అబ్బగోని అశోక్ గౌడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భారతదేశంలో స్త్రీకి ప్రత్యేక గౌరవాన్ని కల్పించాలని మన సాంప్రదాయంలో ఉన్నదని దాన్ని పక్కనపెట్టి ఈరోజు వీడిసీ దుశ్చర్యకు సిగ్గుపడాలని అబ్బగోని అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు.
భారత రాజ్యాంగంలో ఒక వార్డ్ మెంబర్ కు కానీ గ్రామ సర్పంచ్ గాని ఓటు హక్కుతో ఆయనకు ఒక స్థానాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించారని తెలియజేశారు. దీనిని వీడిసి సభ్యులు తప్పుతో పట్టించే విధంగా కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా గ్రామస్తులను రెచ్చగొడుతున్నారని ఇది సరైన పద్ధతి కాదు అని తీవ్రంగా హెచ్చరించారు. ఎవరైతే విడిసి సభ్యులు ఉన్నారో వారి తక్షణమే రద్దుచేసి వారినీ కస్టడీలోకి తీసుకోవాలని ఆర్మూర్ ఏసీపి గారికి ఫిర్యాదు చేశారు. గీత కార్మికులకు, గౌడ కులస్తులకు తగిన బందో బస్తు ఏర్పాటు చేయాలని, వారికి ప్రాణహాని ఉందని, గ్రామంలో 144 సెక్షన్ విధించాలని, పికెటింగ్ ఏర్పాటు చేయాలని ఆర్మూర్ ఏసీపి ని అబ్బగోని అశోక్ గౌడ్ కోరారు.వెంటనే తాళ్ల రాంపూర్ లో వీడీసీ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గీత కార్మికులకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు సూరీనీడ దశరథ్, సాయన్న, నర్సాగౌడ్, తదితరులు ఎస్సీ ఎస్టీ బీసీలు పాల్గొన్నారు అని తెలియజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!