నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:31 (షేక్ గౌస్)
నందిపేట్: నందిపేట్ మండలంలోని ముస్లిం సోదరులు రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తల్వేద, లక్కంపల్లి గ్రామాల ముస్లిం సోదరులకు స్థానిక ఎస్‌ఐ ఎస్.హెచ్. చిరంజీవి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.మండల వ్యాప్తంగా ముస్లింలు ఈద్‌ఘాలలో ప్రత్యేక నమాజ్ నిర్వహించి, సమాజంలోని అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థనలు చేశారు. పవిత్ర ఖురాన్ అవతరించిన మాసంలో ఉపవాస దీక్ష పాటిస్తూ, భక్తి భావంతో నమాజ్ ఆచరించి, రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తల్వేద జామా మస్జీద్ సదర్ ఎం.డి. మహ్మూద్, నసీరుద్దీన్, చోటు, సోహెల్, బాబు, మహబూబ్, మౌలానా జావేద్ తదితరులు ఎస్‌ఐ చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. రంజాన్ సందర్భంగా పోలీసుల సహాయ సహకారాలు ప్రశంసనీయమని, శాంతి, సౌభ్రాతృత్వ వాతావరణాన్ని నెలకొల్పడంలో పోలీసుల పాత్ర గొప్పదని అభిప్రాయపడ్డారు.