నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:29
ఆర్మూడ్ రిజర్వ్ మరియు హోమ్ గార్డ్స్ సిబ్బందికి గల సమస్యలు క్షుణ్ణంగా తెలుసుకున్న పోలీస్ కమీషనర్
నేడు నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ యందు పరేడ్ కార్యాక్రమానికి ముఖ్య అతిదులుగా పోలీస్ కమీషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్, హజరుకావడం జరిగింది.సిబ్బందికి గల సమస్యలను తెలుసుకోవడానికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దర్బార్ కార్యాక్రమం నిర్వహించగా అందులో సిబ్బందికి ఉన్నటువంటి వారి సమస్యలు, సందేహాలు, మరియు బాగోగులు గూర్చి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. సత్వర చర్యలకు ఉత్తర్వులు జారీ చేశారు. సిబ్బందికి ఎప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చిన తమ దృష్టికి తీసుకురావాలని, ప్రతి ఒక్కరు మంచి క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని తెలియజేశారు. సమాజంలో పోలీసుకు మంచిపేరు తేవాలని అన్నారు. ఈ కార్యాక్రమంలో అదనపు పోలీస్ కమీషనర్ (అడ్మిన్) శ్రీ. బస్వారెడ్డి , రిజర్వు ఇన్స్ పెక్టర్స శ్రీ సతీష్ (హోమ్ గార్డ్స్), శ్రీ తిరుపతి (అడ్మిన్), మరియు ఆర్.ఎస్.ఐలు శ్రావణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, దేవి సింగ్ శేషారావు, దత్తు, ఆఫీస్ సూపర్డెంట్లు, శ్రీ శంకర , శ్రీ బషీర్ అహ్మద్ , వనజ రాణి, పోలీసు అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ షకిల్ పాషా, మరియు సిబ్బంది హజరయినారు.