పేకాట అరికట్టే ప్రయత్నంలో సఫలం అవుతున్న టాస్క్‌ ఫోర్స్‌.

నిజామాబాద్‌ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:27 
నూతన కమిషనర్‌ సాయ్‌ చైతన్య ఐపీఎస్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జిల్లా లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు టాస్క్‌ ఫోర్స్‌ను క్రియాశీలంగా మార్చారు. ప్రతిరోజూ ఏదో ఒక చోట టాస్క్ ఫోర్స్ సిబ్బంది మెరుపు దాడులు నిర్వహిస్తూ గంజాయి, డ్రగ్స్‌, పేకాట వంటి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనేవారిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంటూ కఠిన చర్యలు తీసుకుంటున్నారు.తాజాగా శుక్రవారం మాక్షూర్‌ మండలం అమ్రాద్‌ గ్రామంలో టాస్క్‌ ఫోర్స్‌ విభాగం దాడి నిర్వహించింది. టాస్క్‌ ఫోర్స్‌ ఇన్‌చార్జ్‌ అదనపు డీసీపీ శ్రీనివాస్‌ రావు ఆధ్వర్యంలో మాక్షూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న ఈ పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు.ఈ దాడిలో 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని, 6 ద్విచక్ర వాహనాలు, 8 సెల్‌ ఫోన్లు, రూ. 7,740 నగదు స్వాధీనం చేసుకున్నారు. మాక్షూర్‌ ఎస్‌హెచ్‌ఓ ఈ దాడిలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!