ప్రభుత్వ అసమర్ధత వల్లే పదవ తరగతి ప్రశ్నపత్రాల లీకు-బీఆర్ఎస్వి యువజన నాయకులు అభిలాష్ 

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-27
నిజామాబాద్ జిల్లా జూక్కల్ నియోజకవర్గంలో పదవ తరగతి ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి ఆదేశానుసారం బీఆర్ఎస్వి జిల్లా యువజన నాయకులు అభిలాష్ ఆధ్వర్యంలో ప్రతీక సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ చేతగానితనం వల్ల అధికారుల అసమర్థతవల్లే నకిరేకల్, మంచిర్యాల, వికారాబాద్, జుక్కల్ లో పేపర్ లీకు జరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నాలుగు పరీక్షలు నిర్వహిస్తే నాలుగు ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడం చూస్తుంటే విద్యాశాఖ ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతుందన్నారు. కార్పొరేట్ పాఠశాలలతో కుమ్మక్కై కాంగ్రెస్ ఎమ్మెల్యేలే లీకులకు పాల్పడటం సిగ్గుచేటని, పరీక్షలు సరిగ్గా నిర్వహించమని కోరితే కూడా రేవంత్ రెడ్డి డైరెక్షన్లో కేటీఆర్ పై నకిరేకల్ లో అక్రమకేసు పెట్టారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పేషి నుండి ఆర్డర్ రాగానే సెకండ్లలో కేసులు నమోదు చేస్తున్నారు. పేపర్ లీకేజీ కేసులో అసలు నిందితులను తప్పించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి చిల్లర వేషాలు మానుకోవాలి.. పోలీసులు చట్ట ప్రకారం నడుకుంటే మంచిదని, పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మేము న్యాయ పరంగా కొట్లాడుతామని, ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. మేము అధికారంలోకి వచ్చాక అన్ని తెలుస్తామన్నారు. ఈ సమావేశం లో సొంతే చిన్నారం(రమేష్), ప్రశాంత్, మధు, గంగాధర్, నితిన్, యునుస్, రాజు, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!