నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-26
స్త్రీ నిధి యొక్క 12వ సర్వసభ్య సమావేశము హైదరాబాదులో నిర్వహించడం జరిగింది. అందులో నిజామాబాద్ జిల్లా 2023 -24 సంవత్సరానికి సంబంధించి బెస్ట్ ఫర్ఫార్మెన్స్ గా అవార్డు గౌరవ పంచాయతీ రాజ్ శాఖ మినిస్టర్ ధనసరి అనసూయ సీతక్క మరియు దివ్య దేవరాజన్ – సేర్ఫ్ సీఈఓ మరియు స్త్రీ నిధి ఎండి విద్యాసాగర్ చేతుల మీదుగా నిజామాబాద్ జిల్లా డిఆర్డిఓ డిఆర్డిఏ అధికారి సాయ గౌడ్ అవార్డును అందుకోవడం జరిగింది. ఇందుకుగాను సమస్త జిల్లా సిబ్బంది అందరి కృషి వల్ల వరుసగా ప్రతి సంవత్సరము మంచి పెర్ఫార్మన్స్ కనబరుస్తూ అన్ని జిల్లాల కంటే ముందు వరుసలో ఉంటూ ప్రతి సంవత్సరం బెస్ట్ అవార్డు దక్కించుకోవడం జరుగుతుంది.