గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-22
మెండోరా మండలం పోచంపాడు వద్ద ఘటన .
మెండోరా మండలం పోచంపాడు లో శనివారం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్లూరు మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన గజరామ్ అనే వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు. ఈ క్రమంలో అతడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!