నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-22
నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య శుక్రవారం సాయంత్రం ఎడపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ పోలీస్ స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. గంజాయినిర్మూలనకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరయిన గంజాయికి బానిస అయితే వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయటం జరిగిందని తెలియజేశారు. సైబర్ నేరాల నుండి ప్రజలు అప్రమత్తం వుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎసిపి శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, ఎడ పల్లి ఎస్.ఐ వంశీ కృష్ణ పాల్గొన్నారు.