నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి : 19 (షేక్ గౌస్)
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అభివృద్ధి, సంక్షేమానికి సమతుల ప్రాధాన్యత ఇచ్చిందని తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్, నిజామాబాద్ డీసీసీ మానాల మోహన్ రెడ్డి అన్నారు.
వ్యవసాయానికి మద్దతు
రైతుల కోసం ప్రభుత్వం భారీ నిధులు కేటాయించిందని మోహన్ రెడ్డి తెలిపారు. వ్యవసాయానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, రైతు భరోసా వంటి పథకాలకూ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.
సంక్షేమానికి పెద్దపీట
ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించిందని ఆయన అన్నారు. ఎస్సీలకు ₹40,000 కోట్లు, ఎస్టీలకు ₹17,000 కోట్లు, మైనారిటీలకు ₹3,500 కోట్లు కేటాయించడాన్ని ఆయన అభినందించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమని కొనియాడారు.
నిజామాబాద్ కోసం ప్రత్యేక నిర్ణయం
నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని మోహన్ రెడ్డి తెలిపారు. దీనికి ఆయన, సి ఎం రేవంత్ రెడ్డి కి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు.