నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:19 (కట్ట నరేష్ కుమార్ నాయక్)
విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పెన్నుల పంపిణీ
ప్రభుత్వ పాఠశాలలో విద్యాహక్కు చట్టం పై అవగాహన
నిజామాబాద్ జిల్లాలో కమలాపూర్ గ్రామం లో జిల్లా పర్షత్ హై స్కూల్ లో ఈరోజు పదవ తరగతి విద్యార్థులు తో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు కట్టా నరేశ్ కుమార్ నాయక్ ఆధ్యర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కమలాపూర్ లో పదవతరగతి విద్యార్థుల పరీక్షల గురించిన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో విద్య హక్కు చట్టం 2009 గురించి కట్టా నరేశ్ కుమార్ నాయక్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం లో ఆర్టికల్ 21 ఏ ప్రకారం ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం 6-1 4 ఏళ్ల లోపు బాల బాలికలకు కచ్చితంగా చదివించేలా తీసుకువచ్చిన చట్టం 2009 లో వచ్చింది దీంతో బాలకార్మికులు లేకుండా బాల బాలికలకు అందరికీ విద్య హక్కు చట్టం ను అందించే ప్రయత్నం చేస్తున్నా ప్రభుత్వం కి కృతజ్ఞతలు. నేటి బాలబాలికల రేపటి భావిభారత పౌరులుగా తీర్చి దిద్దే అద్భుత అవకాశం విద్యా కే ఉంది కావున ప్రతి ఒక్కరు
విద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదువుకొని
పదవతరగతి పరీక్షలు విజయవంతంగా రాయాలని మీ ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా చదువుకొని ఆత్మవిశ్వాసం తో పదవతరగతి పరీక్షలు విజయవంతంగా రాసి గ్రామ, మండల, రాష్ట్ర స్థాయిలో పాఠశాలకు మీ తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరుకుంటూ ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ రాజా శేఖర్ గౌడ్ గారికి కృతజ్ఞతలు పదవతరగతి విద్యార్థులు కోసం సాయంత్రం క్లాసు ప్రత్యేక కోచింగ్ ఇచ్చి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఉత్తీర్ణత సాధించడానికి సక్సెస్ ను పెంపొందించు కోవడానికి కృషి చేస్తున్న కమలాపూర్ పాఠశాల ఉపాధ్యాయులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు పరీక్షల గురించిన వివిధ అంశాల పై అవగాహన కల్పించడానికి జనవిజ్ఞాన వేదిక నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కొయేడి నర్సింలు గౌడ్ విద్యార్థులను ఉద్దేశించి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్షలకు సంసిద్ధం కావాలని ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని పరీక్ష సమయంలోసమయపాలన పాటించడం తప్పనిసరి కాబట్టి ముందే మీరు పరీక్ష కేంద్రానికి చేరుకొని ప్రశాంతంగా పదవతరగతి పరీక్షలు రాయాలని పేర్కొన్నారు విజయవంతం గా పరక్షలు రాయడం ఎలా? భయం లేకుండా పదవ తరగతిలో విద్యార్థులు పరీక్షలు రాసి ఊరుకు పాఠశాలకు పేరు తీసుకురావాలని జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు కోయేడి నర్సింహులు గౌడ్ అన్నారు. సామాజిక కార్యకర్త జర్నలిస్టు కట్టా నరేష్ కుమార్ నాయక్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కమలాపూర్ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్, పెన్నులు, స్వీట్స్ పంపిణీ కార్యక్రమం విద్యార్థులు తో కలిసి నిర్వహించడం మాట్లాడం అనందగా ఉంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి కోయేడి నర్సింహులు గౌడ్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజా శేఖర్ గౌడ్,మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టంతో, భయం లేకుండ పదో తరగతి పరీక్షలు విజయవంతంగా 100% ఉత్తీర్ణత సాధిస్తామని ఆశాభావం వ్యక్తంచేశారు. పుట్టినరోజు సందర్బంగా మా విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులను పంపిణి చేసి పరీక్షలో ఉత్తీర్ణులైన గ్రెడ్ 1,2,3 విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందజేస్తామని పేర్కొన్న కట్టా నరేశ్ కుమార్ నాయక్ కు శుభాభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు , చేంద్ర శేఖర్,శ్రీకాంత్, అమార్, శ్రీధర చర్యలు,రాఘవేంద్ర, శ్రీధర్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు,బండారి సుజాత, సావిత్రి బాయ్ పూలే మహిళా సొసైటీ ఛైర్మెన్, శ్రీ రామ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.