నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 19: ( షేక్ గౌస్)
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వ్యాపార, ఆస్తి పన్నుల టాక్సుల వసూలు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ బుధవారం రైల్వే స్టేషన్ సమీపంలోని వ్యాపార ప్రదేశాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన వ్యాపారులకు టాక్స్ తక్షణమే చెల్లించాలని సూచించారు. టాక్స్ చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, వ్యాపార స్థలాలకు ముందు ఏర్పాటు చేసిన తెరలను (పర్దాలను) తొలగించాలని ఆదేశించారు.ఈ తనిఖీలో మున్సిపల్ ఆఫీసర్ ఎం.ఆర్.డి.ఓ, మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. .