నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:-19
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.ఎస్, నిజామాబాద్ నగరంలోనీ ఎల్ఐసి చౌరస్తా , దేవి రోడ్ చౌరస్తా, పులంగ్ చౌరస్తా, ఆర్ఆర్ చౌరస్తా, పెద్ద బజార్, నెహ్రూ పార్క్ హైమది బజార్, బోధన్ బస్టాండ్, రైల్వే స్టేషన్, ఆర్టీసి బస్టాండ్ల ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా ఆటో డ్రైవర్ల వాహనాలకు సంబందించిన పేపర్స్ చెక్ చేసారు.ఎలాంటి పని లేకుండా రాత్రి సమయంలో తిరిగే యువతకు కౌన్సిలింగ్ నివాహించారు.ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ యందు మరియు పరిసర ప్రాంతాలలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. అక్కడ గల అధికారులకు పలు సూచనలు ఇవ్వడం జరిగినది.