నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:18
శాసనమండలి సమావేశాల్లో పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో భవిష్యత్తులో ఓబీసీ నేత సీఎం అవుతారని పేర్కొన్నారు. శాసన మండలిలో మంగళవారం ఆయన ప్రసంగించారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్రంపై ఒత్తిడితేవాలని కోరారు. ఇందుకోసం అన్ని పార్టీలు తమతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మంచి పాలన అందిస్తున్నారని.. అయితే భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఓబీసీ సీఎం అవుతారని వ్యాఖ్యానించారు.