నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 18:(షేక్ గౌస్)
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పల్ సూర్యనారాయణ అసెంబ్లీలో జిల్లాలోని ప్రధాన సమస్యలను ప్రస్తావించారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై స్పష్టత ఇవ్వాలని, నాగారంలో పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను అర్హులకు అందించాలని కోరారు.తెలంగాణ యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్ కొరతపై ఆందోళన వ్యక్తం చేసి, ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ బస్టాండ్ పునరుద్ధరణ, ఐటీ హబ్ అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రతి నియోజకవర్గానికి సమానంగా SDF నిధులు కేటాయించాలి” అని ప్రభుత్వాన్ని నిలదీశారు.