నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:18
చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందారు. ఈ ఘటన నగరంలోని మూడవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్లితే..నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో ఆదివారం సైకిల్ పై వెళ్తున్న చంద్రశేఖర్ కాలనీకి చెందిన సయ్యద్ షాహిజాద్ (11)ను తప్పించబోయి కారు అదుపుతప్పి సైకిల్ ఢీ కొనడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
దీంతో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.