నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 13:
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఫూలాంగ్ చౌరస్తాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని గురువారం నూడా చైర్మన్ కేశ వేణు మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, సంబంధిత శాఖలతో కలిసి పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలను గుర్తించి, తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కేశ వేణు మాట్లాడుతూ, రహదారి భద్రతను పెంపొందించేందుకు తగిన జాగ్రత్తలు వెంటనే అమలు చేయాలని అధికారులకు సూచించారు. నగర ప్రజలు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతి ఒక్కరి సహకారంతోనే రోడ్డు ప్రమాదాలను నివారించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.