హోళీని ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జ‌రుపుకోవాలి -పండ‌గ వేళ అల్ల‌ర్ల‌కు పాల్ప‌డితే ఊపేక్షించం -నిజామాబాద్ సీపీ సాయి చైత‌న్య, ఐపీఎస్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 13:
ఈరోజు పోలీస్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో నిజామాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి సాయి చైతన్య ఐపీఎస్ మాట్లాడుతూ.

ప్ర‌శాంతమైన వాతావ‌ర‌ణంలో కుటుంబ‌స‌మేతంగా హోళీ పండుగను జ‌రుపుకోవాల‌ని నిజామాబాద్ సీపీ పి.సాయి చైతన్య, ఐపీఎస్  ప్ర‌జ‌ల‌కు సూచించారు. హోళీ సంద‌ర్భంగా ఆరోగ్య‌క‌ర‌మైన‌ సంప్ర‌దాయ రంగుల‌ను వినియోగించాల‌ని ఆయ‌న అన్నారు.శుక్ర‌వారం ఉద‌యం 6 గంట‌ల నుంచి మద్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు వేడుక జ‌రుపుకోవాల‌ని చెప్పారు. ఇష్ట‌ప‌డని వ్య‌క్తులు, ప్ర‌దేశాలు, వాహ‌నాల‌పై రంగులు చ‌ల్ల‌టం, రంగు నీళ్ల‌ను పోయ‌డం స‌రికాద‌ని అన్నారు.బ‌హిరంగ ప్రాంతాల్లో ఇత‌రుల‌ను ఇబ్బందులు పెట్ట‌డం, అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించ‌డం, అల్ల‌ర్ల‌కు పాల్ప‌డితే చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు. శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగిస్తే ఏమాత్రం ఉపేక్షించ‌బోమ‌ని హెచ్చ‌రించారు.బైక్‌లతో ర్యాలీలు చేయ‌డం, ర‌హ‌దారుల‌పై ఇష్టం వ‌చ్చిన‌ట్లు తిర‌గ‌డం చేయ‌వ‌ద్ద‌ని హిత‌వు ప‌లికారు. హోళీ పండ‌గ నాడు డ్రంకెన్ డ్రైవ్ నిర్వ‌హిస్తామ‌ని, మ‌ద్యం తాగి వాహ‌నాలు న‌డిపి రోడ్డు ప్ర‌మాదాల‌కు కార‌ణం కావొద్ద‌ని అన్నారు.మ‌హిళ‌ల ప‌ట్ల గౌర‌వంగా న‌డుచుకోవాల‌న్నారు. క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో సీసీటీవీ కెమెరాల నిఘా ఉంటుంద‌ని చెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!