నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:12
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారని ఆయన ఆరోపించారు.రైతు భరోసా, మహాలక్ష్మి, నిరుద్యోగ భృతి హామీలు అమలు చేయకుండా, గొప్పలు చెప్పుకోవడం మాత్రమే చేస్తోంది” అంటూ ధన్ పాల్ విమర్శించారు. “తెలంగాణ అభివృద్ధి కుంటుపడుతోంది” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.