నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 11.
నిజామాబాద్‌లో అర్ధరాత్రి 12 గంటలకు దుకాణాలను మూసివేయాలన్న పోలీసుల సూచనతో, పోలీసుల తీరుపై AIMIM జిల్లా అధ్యక్షుడు ఫయాజ్ ఉద్దీన్ .. నిజామాబాద్ అధ్యక్షుడు షకీల్ అహ్మద్ మరియు AIMIM బృందం పోలీసుల సీనియర్ అధికారులతో మాట్లాడి GO Ms. నం. 36 మరియు తెలంగాణ ప్రభుత్వం నుండి వచ్చిన ఉత్తర్వులను సమీక్షించమని వారిని ఒప్పించారు. నాయకులు అహ్మదీబజార్, చేరుకుని పోలీసులతో మాట్లాడి దుకాణం తెరిచేందుకు నెల 4వ తేదీ వరకు అనుమతి ఇచ్చారనీ తెలిపారు. రంజాన్ సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు పోలీసులు పనిచేస్తారని హామీ ఇచ్చారు.పోలీసులు ఉన్నతా ఆధికారులందరి తోనూ మాట్లాడారు.ఈ సందర్భంగా వ్యాపారస్తులు AIMIM బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.