నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:10
జీజీహెచ్ నుంచి ఆటోను ఎత్తుకెళ్లిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకటో టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. మద్నూర్ మండలం సుల్తాన్ పేట్ గ్రామానికి చెందిన మోహన్ ఈనెల 5న తన ఆటోను నగరంలోని జీజీహెచ్లో రాత్రి పార్కింగ్ చేశాడు. 6వ తేదీ తెల్లవారుజామున చూసేసరికి ఆటో కనిపించలేదు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాజాగా సోమవారం బోధన్ బస్టాండ్ ప్రాంతంలో తనిఖీలు చేస్తుండగా.. ఆటోతో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఖలీద్ బిన్ మహ్మద్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని ప్రశ్నించగా ఆటోను చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారనీ తెలిపారు.