నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 10 :
నిజామాబాద్ జిల్లా నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన పి.సాయి చైతన్య సోమవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నూతన సీ.పీని కలెక్టర్ స్వాగతిస్తూ, అభినందనలు తెలియజేశారు. అనంతరం రాష్ట్ర సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్, మరియు సీ.పీ పాల్గొన్నారు.