నవోదయ విద్యాలయంపై అరవింద్ విషప్రచారం..నిజామాబాద్ పార్లమెంటుకు ఒక్క ఇండస్ట్రీనైనా తీసుకొచ్చావా..?సుదర్శన్ రెడ్డి పై ఎంపీ అరవింద్ దిగజారుడు మాటలు..నూడా చైర్మన్ కేశ వేణు..

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 9.

సుదర్శన్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకోం.. తహర్విన్ బిన్  హమ్దాన్.
జవహర్ నవోదయ విద్యాలయం జిల్లాకు మంజూరు చేసినట్టే చేసి దానిపై కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని నూడా చైర్మన్ కేశ వేణు ద్వజమెత్తారు.ఆదివారం నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు..
కేవలం మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే తప్పుడు ఆలోచనలు తప్ప నిజంగా నీకు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి పై చిత్తశుద్ధి ఉంటే నిజామాబాద్ స్మార్ట్ సిటీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. గడిచిన ఆరు సంవత్సరాల కాలంలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని పేర్కొన్నారు.ఎంపీగా గెలిచి పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ తోపాటు మాధవ నగర్ బ్రిడ్జి మరియు మామిడిపల్లి బ్రిడ్జిలను, అర్సాపల్లీ బ్రిడ్జిలు ఏళ్ల తరబడిగా పెండింగ్ లో పెట్టారని కొన్ని ఏళ్లుగా వాటి పనులు ఇంకా పూర్తి కాకపోవడం ఎంపీ అరవింద్ చేతగానితనానికి నిదర్శనం అని ఆయన అన్నారు.రాష్ట్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరబి పనులు చకచకా జరిగిపోతున్నాయనీ గుర్తు చేశారు. సుదర్శన్ రెడ్డి హయాంలో జిల్లాకు ప్రభుత్వ ఆస్పత్రి మెడికల్ కాలేజ్ తెలంగాణ విశ్వవిద్యాలయం లాంటి వాటిని జిల్లాకు మంజూరు చేయించారని ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా అభివృద్ధి కోసం అనేక రకాల ప్రాజెక్టులను తీసుకురావడం జరిగిందని గుర్తు చేశారు.
రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమన్నారు. జవహర్ నవోదయ మంజూరు విషయమై మా ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి పై ఎంపీ అరవింద్ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని బీఆర్ఎస్, బీజేపీ నాశనం చేశాయని విమర్శించారు. ఫ్యాక్టరీని తెరిపిస్తామని మభ్యపెట్టి ప్రజలను మోసం చేశారని తెలిపారు. నిజామాబాద్ పార్లమెంటుకు ఒక్క ఇండస్ట్రీనైనా తీసుకొచ్చావా..?
యువతకు ఒక్క ఉద్యోగమైనా ఇచ్చావా..? అని ప్రశ్నించారు. అహంకారపూరిత వ్యాఖ్యలు సరికావని ఆయన హితవు పలికారు. నియోజకవర్గానికి ఒక్క జాతీయ కనెక్టివిటీ రోడ్డునైనా తీసుకొచ్చావానీ మండిపడ్డారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!