నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 9.
నిజామాబాద్ జిల్లా కేంద్రం సుభాష్ నగర్ శ్రీ రామాలయంలో మాస కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ఛైర్ పర్సన్ సరళ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి నెలలో వచ్చే రామచంద్ర స్వామి జన్మ నక్షత్రం రోజున మాస కళ్యాణం చేయడం ఆనవాయితీ అన్నారు. సోమవారం ఉ. 7గం.లకు పుష్యమి నక్షత్రం సందర్భంగా విద్యార్థులలో జ్ఞాపక శక్తిని పెంచే ‘ స్వర్ణామృత ప్రాశన ‘ ఉంటుందని తెలిపారు.