నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 9.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా సాయి చైతన్య సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నట్టు కమిషనరేట్ అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.హైదరాబాద్ నార్కోటిక్ విభాగంలో ఎస్పీ విధులు నిర్వహిస్తున్న సాయి చైతన్య ను శుక్రవారం నిజామాబాద్ సీపీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.ఇక సిపి నియామకంతో అవినీతి, విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిలో గుబులు మొదలయిందంటున్నారు. ముక్కుసూటి అధికారిగా గుర్తింపున్న సాయి చైతన్య అవినీతి, అక్రమాలను సహించరని, విధుల్లో నిర్లక్ష్యం చూపేవారిపై కఠినంగా వ్యవహరిస్తారని, ఒత్తిళ్లు వచ్చినా వెనక్కితగ్గరనే ప్రచారం జరుగుతోంది.