చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 8.
చోరీలకుపాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం విలేకరులకు వెల్లడించారు. నగరంలో ఇటీవల వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక ఆటోలో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. ఇటీవల నగరంలోని ట్రాన్స్ పోర్ట్ ఆఫీసులో చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో వారి నుంచి చోరీ చేసిన రూ. 10.17 లక్షల నగదు, ఆటోను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించామని ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి తెలిపారు.కేసులుపట్టుబడిన నలుగురు నిందితులపై ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 40కిపైగా కేసులు నమోదై ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. నగరంలోని అన్నీ పోలీస్ స్టేషన్లలో పాటు డిచ్ పల్లి, వర్ని, బోధన్, బాన్సువాడలలో కేసులు ఉన్నాయన్నారు. కేసు ఛేదనలో కృషి చేసిన సీఐ శ్రీనివాస్ రాజ్, మూడో టౌన్ ఎస్సై హరిబాబు, సీసీఎస్ సీఐ సురేశ్, రవీందర్, అబ్బులు, చమీంద్, సంగేష్, సిబ్బందిని ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి అభినందించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!