నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక 8.(షేక్ గౌస్)
నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పాల్గొని, మహిళల హక్కులు, సాధికారత గురించి మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని, ప్రస్తుతం కూడా కొత్త పథకాలను ప్రవేశపెట్టి మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు సహాయపడుతోందని తెలిపారు.ఈ వేడుకలో మహిళా కాంగ్రెస్ నాయకులు పోల ఉష, ఆశాబీ, గాజుల సుజాత, మలైకా బేగం, విజయ రాణి, అపర్ణ, మీనా తదితరులు పాల్గొన్నారు.