నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 7.
నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షకు 652 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డి ఐ ఈ ఓ రవికుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 18,649 మంది విద్యార్థులకు గాను 17,997 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని ఆయన వివరించారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులతో పాటు తాను ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లు పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేశామన్నారు.