నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 6.
బస్సుడ్రైవర్ సడన్ బ్రేకు వేయడంతో వరుసగా వాహనాలు ఢీకొన్న ఘటన నగరంలో చోటుచేసుకుంది. ముబారక్ నగర్ లో ఆర్ బీవీఆర్ఆర్ స్కూల్ వద్ద గురువారం సాయంత్రం ఆర్టీసీ బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. అనంతరం ఈ కారును వెనుక నుంచి మరో స్కూల్ బస్సు ఢీకొంది. కాగా.. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.