నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 6.
దేశంలో ప్రతిగ్రామంలో 200 నుండి 300 మంది ఒంటరి మహిళలు అనేక ఆర్థిక ఇబ్బందులతో జీవిస్తున్నారని వారి సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టంచేయాలని బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత డిమాండ్ చేశారు.
గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్ భవన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, భారతదేశ మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రమ్మ ఫూలే వర్ధంతి సందర్భంగా బహుజన శ్రామిక మహిళలు అనే అంశంపై జరిగిన జిల్లా సదస్సులో ఆమె మాట్లాడుతూ1909లో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో సోషలిస్టుపార్టీ ఆధ్వర్యంలో సమాన పనికి వేతనం,పని గంటలుతగ్గింపు, ఓటు హక్కు తదితర సమస్యలపై 15000 మంది శ్రామిక మహిళలు మొట్టమొదటి సారిగా గళం విప్పిన రోజునే అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా చరిత్రలో మిగిలిపోయిందని తెలిపారు ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్ భవన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం తోపాటు, భారతదేశ మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రమ్మ ఫూలే 128వ వర్ధంతి సందర్భంగా బహుజన శ్రామిక మహిళల హక్కులపై బహుజన లెఫ్ట్ మహిళా సంఘం ఆధ్వర్యంలో జిల్లా సదస్సును నిర్వహించారు.భారతదేశంలో బహుజన శ్రామిక మహిళల హక్కులపై విరామేరుగని పోరాటాలు నిర్వహించిన చదువుల తల్లి సావిత్రమ్మ ఫూలే అని తెలిపారు. పోరాట వారసత్వాన్ని బహుజన శ్రామిక మహిళా ఉద్యమాలు భుజస్కంధాలపై మోస్తూ తమ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచినప్పుడే బహుజన శ్రామిక మహిళల హక్కులు, సంక్షేమం, సామాజిక న్యాయం సమగ్రాభివృద్ధి స్వేచ్ఛా సమానత్వం సౌభ్రాతృత్వం సాధ్యమవుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో సభాద్యక్షులుగా బహుజన లెఫ్ట్ మహిళా సంఘం జిల్లా నాయకురాలు తూర్పు విమల,ముఖ్య అతిథిగా నిజమాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్: ఫతిమా రాజ్, మహిళా టౌన్ ఎస్ఐ పుష్పా, గౌరవ అతిథిగా జి.ఆర్ సుజాత తెలంగాణ ఫ్యామిలీ మహిళా కోఆర్డినేటర్ నిజామాబాద్ సదరన్ హోం సూపరింటెండెంట్ జ్యోత్స్న ఎన్జీవో నాయకులు వర్ని రాజయ్య, బహుజన శ్రామిక మహిళా ఉద్యమ నాయకులు ప్రమీల, నిజామాబాద్ నగర కమిటి నాయకులు స్వాతి, పద్మిని, నవిపేట్ పోసాని జిల్లాలోని వివిధ మండలాల నుండి మహిళలు పాల్గొన్నారు.