నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 5.(షేక్ గౌస్)
వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు ప్రణాళికతో రెడీగా వుండాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి, తాగునీటి సరఫరా, ఆస్తి పన్ను, ఎల్.ఆర్.ఎస్ వసూళ్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో ఫిర్యాదు పెట్టెల ఏర్పాటు తదితర అంశాలపై “దిశా-నిర్దేశం” చేశారు.గ్రామాల్లో నీటి ఎద్దడి రాకుండా ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట యుద్ధప్రాతిపదికన మరమ్మతులు జరిపించాలని సూచించారు. రెండు రోజుల్లో బోర్లు, చేతిపంపుల మరమ్మతులు పూర్తి చేయాలని, మెకానిక్‌లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
హస్టళ్లలో పిర్యాదు బాక్సులు…
హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో నీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగేలా చూడాలని, అంగన్వాడీలు, సంక్షేమ వసతి గృహాలకు తాగునీరు సమృద్ధిగా అందాలని స్పష్టంచేశారు. వాటర్ ట్యాంకుల శుభ్రత, ఓపెన్ బావుల క్లోరినేషన్ తప్పనిసరిగా చేయాలని సూచించారు.అలాగే హాస్టల్ లో పిర్యాదు బాక్స్ లు ఏర్పాటు చేసి ఫిర్యాదులపై ప్రతి వారం సమీక్షించాలన్నారు.
ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలి.
ఆస్తి పన్ను, ఎల్.ఆర్.ఎస్ వసూళ్లలో వేగం పెంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మార్చి నెలాఖరు లోపు ఎల్.ఆర్.ఎస్ ఫీజు చెల్లిస్తే 25% రిబేట్ వర్తిస్తుందని ప్రజలకు తెలియా పరచాలని వివరించారు.
ఇందిరమ్మ ఇండ్ల మార్కింగ్ ….
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నిర్మాణాలకు మార్కవుట్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో జెడ్పి సీఈఓ సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీపీఓ శ్రీనివాస్, ట్రాన్స్కో ఎస్.ఈ రవీందర్, జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, మున్సిపల్ కమిషనర్లు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.