నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 2.
పవిత్ర రంజాన్ మాసం భక్తి శ్రద్ధలతో ప్రారంభమైంది. శనివారం సాయంత్రం చంద్ర దర్శనంతో మత పెద్దలు రంజాన్ ప్రారంభాన్ని ప్రకటించారు.శనివారం రాత్రి నుంచే మసీదుల్లో ప్రత్యేక నమాజులు (తరావీహ్) నిర్వహించగా, ఆదివారం ఉదయం ముస్లింలు వేకువజామున సహేరి భుజించి, ఫజర్ నమాజుతో ఉపవాస దీక్షను ప్రారంభించి, సాయంత్రం ఇఫ్తార్‌తో రోజాను ముగించారు.ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ, రంజాన్ మాసం ఉపవాస దీక్ష, నమాజు, జకాత్, దానం, భక్తి, క్షమాపణల సమాహారంగా ఉంటుందని, ఈ పవిత్ర నెలలో పేదవారికి సహాయం చేయడం ఎంతో మహత్తరమైన కార్యమని తెలిపారు.ఇదిలా ఉండగా, పలు ప్రాంతాల్లో మసీదులు విద్యుత్ దీపాలతో అలంకరించబడ్డాయి. ప్రజలు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వివిధ రాజకీయ నేతలు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.