నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 21.
ఫిబ్రవరి 19 న అర్ధరాత్రి కొత్త పేట్ గ్రామ శివారులో దారిదోపిడీకి పాల్పడిన ముగ్గురు బిహర్ హమాలీలను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ సౌత్ రూరల్ సిఐ సురేష్ తెలిపారు. ఈరోజు రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిఐ సురేష్ మాట్లాడుతు.. ఎడపల్లి మండలం కుర్నపల్లికి చెందిన ఫొటోగ్రాఫర్ పంచల్ గితేష్ నిజామాబాద్ లో తన పని ముగించుకుని బుదవారం రాత్రి బైక్ పై ఇంటికి తిరిగి వెళ్తుండగా కొత్త పేట్ గ్రామం వద్ద ముగ్గురు వ్యక్తులు దాడిచేసి దోచుకున్నారు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా కొత్తపేట్ శివారులోని శ్రీ గంగా రైస్ మిల్ యజమాని గోపాల్ వద్ద హమాలీలుగా పని చేస్తున్న కుంధన్, విజయ్, సుంధర్ లను అదుపులోకి తీసుకుని విచారించడంతో వారే దారిదోపిడికి పాల్పడినట్లు ఒప్పుకున్నారనీ తెలిపారు. 24 గంటల్లోను ముగ్గురు బిహర్ కు చెందిన హమాలీలను అరెస్టు చేసి వారిని రిమాండ్ కు తరలిస్తున్నట్లు వివరాల్లో వెల్లడించారు. ఈ కేసు చేధనలో రూరల్ ఎస్ఐ అరిప్, మరియు పోలీస్ సిబ్బందిని సిఐ సురేష్ అభినంధించారు.