తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 17.
రైలులో ప్రయాణిస్తున్నా యువతి మెడలో నుంచి బంగారు గొలుసు అపహరణకు గురైనట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపారు. రైల్వే పోలీసుల కథన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన రేణుక తన స్నేహితులతో కలిసి బాసరకు వెళ్లి రైలులో తిరిగి ప్రయాణిస్తుండగా. రైలులో కిటికీ పక్కన కూర్చోగా జాన్కంపేట్ స్టేషన్ క్రాసింగ్ వద్ద ట్రైన్ ఆగింది. దీనితో గుర్తుతెలియని దుండగుడు టికీలో నుంచి ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలికి పోలీసులు దుండగుడుని పట్టుకొని బంగారు గొలుసుని తిరిగి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.