గిరిజన ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ గారి 286వ జయంతి సందర్భంగా పాల్గొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ  అబ్బ గోని అశోక్ గౌడ్ 

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 15.

గిరిజనుల ఆరాధ్య దైవమైనటువంటి, అహింస వాది, శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని భట్టాపూర్ లో ఘనంగా నిర్వహించిన ఉత్సవాలకు బంజారా వాసుల ఆహ్వానం మేరకు మెదక్, అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ  అబ్బగోని అశోక్ గౌడ్ హాజరై సంత్ సేవాలాల్ గారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్బ గోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారు సమాజ శ్రేయస్సు కోసం చూపించిన మార్గం ఆదర్శనీయమని ఈ సందర్భంగా ఆ మహానియుడీ జయంతి సందర్భంగా గిరిజన బిడ్డలకు ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బగోని అశోక్ గౌడ్ తెలియజేశారు.

మద్యపానం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని గిరిజనులకు, బంజరులకు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ కారు సూచించారని వారి ఆదర్శ స్ఫూర్తితో ముందుకు సాగాలని అశోక్ గౌడ్ తెలియజేశారు. ఆయన సేవలు మరువలేవని, హిందూ సంప్రదాయంలో బంజారా వాసులకు ఇదొక పెద్ద పండుగ అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో భూక్య వెంకట్ నాయక్, సతీష్, జగన్ నాయక్,నారాయణ నాయక్, రాజేష్ నాయక్, తరుణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!