నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 13.
నిజామాబాద్ నగరంలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో గురువారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ట్రాఫిక్ ఏసిపి నారాయణ మాట్లాడుతూ… ట్రాఫిక్ నిబంధనలు అందరికీ తెలిసిన కూడా పాటించడం లేదన్నారు. ప్రధానంగా సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించాలని, రాంగ్ రూట్లో వెళ్లడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు.