కీటక జనీత వ్యాధులపై డి ఎం హెచ్ ఓ సమీక్ష.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి13.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని కీటక జనిత వ్యాధుల నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో పనిచేస్తున్న వివిధ పి హెచ్ సి ల ల్యాబ్ టెక్నీషియన్లు, నోడల్ సూపర్వైజర్లు,సబ్ యూనిట్ అధికారులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి.రాజశ్రీ మాట్లాడుతూ జిల్లా లో కీటక జనిత వ్యాధులు ముఖ్యంగా మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ ప్రబలకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లు మలేరియా,యాక్టివ్ పాజిటివ్ రక్తపూతల పరీక్షలను పెంచాలని, నోడల్ అధికారులు, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు యాంటీ లార్వెల్ స్ప్రే, ఫ్రైడే డ్రైడే, ద్వారా నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి వాటిని తొలగించాలన్నారు. ఆశా కార్యకర్తలు ఏఎన్ఎం రోజువారీ గృహ సందర్శనలో జ్వర సర్వే తో పాటుగా కీటక జనిత వ్యాధులపై అవగాహన కలిగించాలని, బోదకాల వ్యాధికి రాత్రి నిర్వహించే సర్వేను చేపట్టాలని. సెంటినల్ సర్వేలో భాగంగా ప్రతి టీం 300 స్లైడ్స్ చొప్పున మొత్తం 6000 స్లైడ్స్ సేకరించాలని తెలిపారు. జిల్లా ఉపవైద్యాధికారులు ఆర్మూరు, బోధన్, నిజామాబాద్ డివిజన్ల వారీగా వైద్యాధికారులు, ల్యాబ్ టెక్నీషియన్లు, పి హెచ్ సి నోడల్ అధికారులు, సబ్ యూనిట్ అధికారులకు సమీక్ష సమావేశాలు నిర్వహించి కీటక జనీత వ్యాధులు ప్రబలకుండా చూడాలన్నారు..

ఏ ఇంటి వద్ద కూడా దోమలు కనిపించకుండా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో కీటక జనీత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్, అసిస్టెంట్ మలేరియా అధికారి అబ్దుల్ సలీం, వివిధ మండలాల వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!