తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 13.
బోధన్ పట్టణంలోని లయన్స్ క్లబ్ లో జరిగిన నేత్ర రీజియన్ కాన్ఫరెన్స్లో లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ వారు 300కు పైగా సేవా కార్యక్రమాలు చేసినందుకు గాను అత్యధికంగా 18 అవార్డులు రావడం జరిగిందని అందుకు చాలా సంతోషంగా ఉందని డిస్టిక్ అడిషనల్ క్యాబినెట్ సెక్రటరీ లయన్ కొడాలి కిషోర్ అన్నారు. అలాగే లయన్స్ క్లబ్ ఉత్తమాలుగా బోధన్ అధ్యక్షులు నాగేశ్వరరావు, కార్యదర్శి ఉమేష్ షిండే, కోశాధికారి సురేందర్ అవార్డులు అందుకున్నారు.