నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 13.
నిజామాబాదులో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సౌత్ సీఐ సురేష్ తెలిపారు. అర్సపల్లి లో వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా షేక్ అఫ్తాబ్ అనుమానాస్పందంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నారు. ఆటోనగర్ తాళం వేసిన ఇంట్లో దొంగతనం చేసి నగలు అమ్మేందుకు వెళుతుండగా పట్టుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితుడి నుంచి తొమిదిన్నర తులాల బంగారం, రూపాయలు 15 వేల నగదు,2 వాచులు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ వివరించారు