రాబోయే శబ్-ఎ-బరాత్ జగ్నే కి రా త్రి సందర్భంగా ముస్లిం భక్తులు తమ పూర్వీకుల సమాధులను సందర్శించి వారి కోసం ప్రత్యేక దువాలు చేసే సంప్రదాయం ఉంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ బుధవారం ముస్లింల ఖబ్రస్తాన్లను స్వయంగా పరిశీలించారు.ఈ తనిఖీ సందర్భంగా లైటింగ్, పరిశుభ్రత, ఇతర సదుపాయాల ఏర్పాటు గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా పడిపోయిన చెట్లు, ఎండిపోయిన మొక్కలు, చెత్తాచెదారం పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. అదేవిధంగా అనవసరమైన గడ్డి, వృథా మొక్కలను వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు.కమిషనర్ మున్సిపల్ సిబ్బందికి కఠినంగా ఆదేశాలు ఇచ్చి, శబ్-ఎ-బరాత్ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని సూచించారు.