నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 28
మద్యం తాగి బండి నడిపితే తెలుగు వెళ్లడం ఖాయం. మందు బాబులారా తస్మాత్ జాగ్రత్త అంటూ పోలీసులు హెచ్చరిస్తున్న మందుబాబుల తీరు మారడం లేదు. ఇదే తరహాలో తాజాగా మరో ఆరుగురికి జైలు శిక్ష పడింది. మద్యం సేవించి వాహనాలు నడిపిన ఆరుగురికి న్యాయస్థానం జైలు శిక్ష విధించిందని ఏసీపీ రాజా వెంకటరెడ్డి ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ సి.హెచ్. సింధు శర్మ, ఆదేశానుసారంగా నిజామాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడపడం వలన 22 మందికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం నాడు నిజామాబాద్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ పరిధిలలో పలు పోలీస్ స్టేషన్ల వారీగా పట్టుబడిన వారికి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించి వారిని నేడు జిల్లా మార్నింగ్ కోర్టులో హాజరుపరచగా వారికి స్పెషల్ జ్యూడిషియల్ 2వ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జాన్ బేగం శిక్షలు విధించారు. అందులో సిర్పూర్ గ్రామానికి చెందిన మోత్కూర్ వంశీ గౌడ్,2కు రోజులు జైలు శిక్ష, ఖానాపూర్ కు చెందిన విపిన్ కుమార్ కు 1 రోజు జైలు శిక్ష, అంకాపూర్ గ్రామానికి చెందిన మిర్యాల నవీన్ కు ఒక రోజు జైలు శిక్ష, గౌతమ్ నగర్ కు చెందిన గడ్డం శ్రీశైలం కు 2 రోజుల జైలు శిక్ష, బోధన్ మండలంకు చెందిన ఎం. శేఖర్ కు 3 రోజుల జైలు శిక్ష, అభంగపట్నం కు చెందిన రాథోడ్ కిరణ్ కు 2 రోజులు శిక్ష విధించారని ఏసీబీ తెలిపారు మంగళవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు1 టౌన్, 3 టౌన్, 4 టౌన్, 5 టౌన్ పి.ఎస్ పరిధిలో వాహనాలను తనిఖీ చేయగా(29) ద్విచక్ర వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేనందున ఆ వాహనాలను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అదేవిధంగా వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన పత్రాలను సక్రమంగా ఉంచుకోవాలని జిల్లా ప్రజలకు ఏసిపి రాజా వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు.