నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 21.
నిన్న తేదీ 20.01.2025 సోమవారం నాడు సాయంత్రం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి డ్రంకెన్ డ్రైవ్ వెహికల్ షూరిటీ కొరకు జనార్ధన్ వ్యక్తి రాగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు తన వద్ద ఉన్న 25 వేల విలువ గల 3 గ్రాముల బంగారాన్ని పోగొట్టుకున్నారు. జనార్దన్ పోగొట్టుకున్న బంగారం ట్రాఫిక్ కానిస్టేబుల్ మహమ్మద్ ఫైజుద్దీన్ కి దొరకగా అ వ్యక్తిని గుర్తించి ఈ రోజు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ మరియు ట్రాఫిక్ పిఎస్ సిబ్బంది అతని కి అప్పగించడం జరిగినది, ఇ కార్యక్రమంలో కానిస్టేబుల్ మహమ్మద్ ఫైజుద్దీన్ ను ఇన్స్పెక్టర్ ప్రసాద్ అభినందించారు. మరియు బాధితుడు సంతోషాన్ని వ్యక్తం చేసి, ట్రాఫిక్ పోలీసు వారికి కృతజ్ఞతలు తెలిపినారు.