CEIR PORTAL ద్వారా 71 సెల్ ఫోన్ రికవరి చేసి ఇచ్చిన అదనపు పోలీస్ కమీషనర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 21.
ఈ మధ్య కాలంలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో పోగొట్టుకున్న 71 సెల్ ఫోన్ లు CEIR PORTAL ద్వారా రికవరి చేయడం జరిగింది.

ఈ సందర్భంగా అదనపు పోలీస్ కమీషనర్ గారు మాట్లాడుతూ ప్రతీఒక్కరు వారి సెల్ ఫోన్లను వాడడంలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలపట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎవ్వరైనా వారి సెల్ ఫోన్ పోయినట్లయితే వారుCEIR PORTAL ద్వారా అట్టి నంబర్ ను www.ceir.gov.in  వెబ్ సైటు లో వెళ్లి అందులో పూర్తి వివరాలు పొందపర్చాలి అని, అలా చేసినట్లయితే త్వరగా వారి సెల్ ఫోన్ ను సులభంగా  పట్టుకోవడం జరుగుతుందని కావున ప్రజలు ఈ పద్దతిని సద్వినియోగపర్చుకోవాలని తెలియజేశారు.ఈ విధంగా రికవరి చేసిన సెల్ ఫోన్ లను నేడు పోలీస్ కార్యాలయంలో నిజామాబాద్ అదనపు పోలీస్ కమీషనర్ ( అడ్మిన్ ) జి. బస్వారెడ్డి  ఆధ్వర్యంలో 71 మందికి ఇవ్వడం జరిగింది.

ఇందులో కృషిచేసిన బి. మాన్ సింగ్,పి.సి: 663 బోధన్ టౌన్ పి.యస్., డి. అనుషా  పి.సి 2704, టౌన్ 1 పి.యస్. ఆర్. సుష్మ,  పి.సి :2312 ఐ.టి సెల్, లను ప్రశంసా పత్రములు ఇచ్చి అభినందించడం జరిగింది.

 

 

 

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!