నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 13.
బాల్కొండ మండలం చిట్టాపూర్ సమీపంలో జాతీయ రహదారి 44పై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మల్ వైపు నుండి ఆర్మూర్ వైపు వెళ్తున్న బైక్‌ను గుర్తు తెలియని భారీ వాహనం ఢీకొని, బైక్‌పై ఉన్న వ్యక్తిపై దూసుకెళ్లడంతో మేస్త్రి రెండు ముక్కలై అక్కడికక్కడే మృతి చెందాడు.ప్రమాదం స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడిని నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన మేస్త్రి శ్రీనివాస్‌గా గుర్తించారు. అతను ఆర్మూర్ నుండి నిర్మల్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదం మృతుడి కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలోకి నెట్టింది. 6 నెలల క్రితం శ్రీనివాస్ భార్య మరణించడంతో, ప్రస్తుతం ఇద్దరు చిన్నారులు అనాధలుగా మారారు. ఈ సంఘటనతో బొప్పారం గ్రామం శోకసంద్రంగా మారింది.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు బాల్కొండ ఎస్‌ఐ నరేష్ తెలిపారు.