నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 7.
నిజామాబాద్ ఇంచార్జ్ పోలీస్ కమీషనర్ సింధు శర్మ, IPS. ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్చార్జ్ ఏసిపి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు సిసిఎస్ సిబ్బంది నిజామాబాద్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల పతంగుల షాపులపై దాడి నిర్వహించి సుమారు 15 వేల రూపాయలు గల 15 చైనా మాంజా బాబిన్లను స్వాధీనం చేసుకున్నారు.అట్టి రెండు పతంగు షాపుల యజమానులు ఎండి ఆశ్రాఫ్ , మరియు ఏండి హైమాత్ అలీ ని స్వాధీనపరుచుకున్న 15 చైనా మాంజా బాబిన్లను తదుపరి చర్య నిమిత్తము 2 టౌన్ ఎస్ హెచ్ ఓ ను అప్పగించడమైనదని తెలిపారు.