అయ్యప్ప స్వామి మహా పడిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు

 తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 12.

జుక్కల్ మండల కేంద్రంలో బుధవారం రాత్రి అయ్యప్ప స్వాములు ఏర్పాటు చేసిన మహా పడిపూజలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ అయ్యప్ప స్వామి మాల ధరించి అత్యంత భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో దీక్ష చేయడం అందరికీ సాధ్యం కాదని, అతికొద్ది మందికే ఈ అవకాశం రావడం వారి అదృష్టం అని అన్నారు.జుక్కల్ నియోజకవర్గం ప్రేమ, ఆప్యాయతలు, ఆధ్యాత్మికతకు పేరుగాంచిందని, ఈ సాంప్రదాయాన్ని మనం ఇలాగే కొనసాగించాలని సూచించారు.అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని,స్వామి వారి చల్లని ఆశీస్సులతో జుక్కల్ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు..

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!