నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 9.
ఈరోజు భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని నిజామాబాద్ జిల్లా రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారి చేతులమీదుగా యుఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా మహాసభల కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పెద్ది సూరి మాట్లాడుతూ భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ 1984 ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఏర్పడింది విద్యరంగా సమస్యలపై ఇతర రాజకీయ l,సామాజిక అంశాలపై అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తున్నారు. అలాగే భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ అఖిల భారత మహాసభలు ఈ నెల (డిసెంబర్) 14,15తేదీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ కేంద్రంగా నిర్వహించడం జరుగుతుంది ఈ మహాసభలో విద్యారంగంపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్తు కార్యచరణ రూపకల్పన చేయబోతున్నాము అన్నారు. ఈ మహాసభలను విద్యార్థులు, మేధావులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ & స్కాలర్షిప్ విడుదల చేయాలని నిజామాబాద్ జిల్లాలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి అధిక నిధులు కేటాయించే రకంగా, జిల్లాకు మంజూరైన ఇంజనీరింగ్ కళాశాల వచ్చే విద్యాసంస్థల లోపు పూర్తిస్థాయిలో అందుబాటులో వచ్చే రకంగా కృషి చేయాలని మరియు ఇతర విద్యారంగ సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ వీటన్నింటినీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లామని అన్నారు ఈ సందర్భంగా స్పందించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారు విద్యారంగ సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తన వంతు కృషి చేస్తానని అన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు వేణుగోపాల్, మారుతి, విష్ణు, విశాల్, భీమ్ రావు తదితరులు పాల్గొన్నారు.